![]() |
![]() |

బుల్లితెరపై యాంకర్ గా విష్ణుప్రియ రాణించింది. సుధీర్ తో కలిసి చేసిన 'పోవా పోరే' షో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత విష్ణుప్రియ వాళ్ళ అమ్మ చనిపోవడంతో తను కొన్నిరోజులు డిప్రెషన్ కి కూడా పెళ్ళింది. అయితే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ తో మంచి పాపులారిటీని సంపాదించుకుంటుంది విష్ణుప్రియ. మానస్ తో కలిసి విష్ణుప్రియ చేసిన 'జరీ జరీ' ఫోక్ సాంగ్ ఫేమస్ అయింది. అయితే మానస్ తో కలిసి చేసిన మరొక ఆల్బమ్ సాంగ్ ' గంగులు' యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండేది. ఆ తర్వాత పలు ఫోక్ సాంగ్స్ చేసి క్రేజ్ తెచ్చుకుంది. శ్రీముఖి, విష్ణుప్రియ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు.. కానీ చాలా రోజులు కలుసుకోలేదు.
ఇక ఇప్పుడు ఇద్దరు ఒకే స్టేజ్ మీద కలిసారు. కిరాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షో కోసం తాజాగా విడుదలైన ప్రోమోలో విష్ణుప్రియ వచ్చింది. ఇందులో బ్రహ్మముడి టీమ్ కావ్య, రాజ్, రాహుల్ వాళ్ళు రాగా.. అనసూయ, శేఖర్ మాస్టర్ జడ్జులుగా శ్రీముఖి యాంకర్ గా చేస్తోంది. రకరకాల డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ప్రోమో నిండిపోయింది. అయితే విష్ణుప్రియ ఎంట్రీపై శ్రీముఖి కౌంటర్లు వేసింది. లేడీస్ అంతా ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. అందులో విష్ణుప్రియ తన గెటప్‌లో వచ్చి డ్యాన్స్ చేస్తుంది. విష్ణుప్రియ అలా డ్యాన్స్ చేస్తుంటే.. శ్రీముఖి కౌంటర్ వేసింది. ఏంటి ఇంకా రికార్డింగ్ డ్యాన్సులు ఆపలేదా? అని సెటైర్ వేసింది. శ్రీముఖి సెటైర్‌కు అక్కడి వారంతా పగలబడి నవ్వేశారు. విష్ణుప్రియ ఏం చేయలేక బిత్తరమొహం వేసుకుని చూసింది. శ్రీముఖి ఇలానే షోలో అందరి మీద తన నోటికి వచ్చినట్టుగా కౌంటర్లు వేస్తూనే ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ షోలో అయితే అనసూయ, శేఖర్ మాస్టర్‌లు కాస్త హద్దులు దాటుతున్నట్టుగానే కనిపిస్తోంది. మరి ఈ షోని ఫ్యామిలీతో కలసి చూడలేనట్టుగా తయారవుతుంది. బిగ్ బాస్ సెలబ్రిటీలతో పాటు సీరియల్ నటులని షోకి తీసుకొచ్చి టీఆర్పీ తెప్పించాలని షో యాజమాన్యం భావిస్తున్నారు. అయితే ఇందులో ఎంటర్‌టైన్మెంట్ కంటే వల్గారిటీ ఎక్కువ ఉండటంతో ఫ్యామిలీతో చూడటానికి ఎవరు ఇష్టపడటం లేదు.
![]() |
![]() |